Total Pageviews

Monday, 27 January 2020

ఎన్నిమార్లు చదవాలో -- తెలుగు గజల్


నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారి గజల్

ఎన్నిమార్లు చదవాలో..మధురమైన నీ రచనలు..!
అక్షరాల మన ప్రేమకు..సాక్ష్యమైన నీ రచనలు..!
కనులు మూతపడవు ఇంత..పలుకలేని మైమరపే..
అపురూపత వర్షించే..దివ్యమైన నీ రచనలు..!
అంతరంగ మౌనమేల..ఒదిగేనో వ్రాసేందుకు..
భువనాలను త్రిప్పిచూపు..కవనమైన నీ రచనలు..!
అనురాగం ఆత్మీయత..అల్లుకున్న భావనలా..
అద్దమంటి నీ మది ప్రతి..రూపమైన నీ రచనలు..!
పలకరించు నవపరిమళ..గంధాలే చిందేనా..
నిత్యచెలిమి కావ్యమంటి..అందమైన నీ రచనలు..!
మాధవుడా నీ గజలే..లోకాలకు ఊయలలే..
పదేపదే పాడుకోగ..సరసమైన నీ రచనలు..!

No comments:

Post a Comment