పూవనిలో ఆమని (కవిత - Courtesy :
Meraj Fathima)
నా చిత్రానికి ఓ video పాటలో అదనపు హంగులు అద్దిన రాణి రెడ్డి గారికి కృతజ్ఞతలు
మంచులో ముంచిన మల్లెవు నీవు,
మంచితో నిండిన మమతవు నీవు,
అరుణోదయంలో విచ్చిన కలువవు నీవు
చంద్రోదయంలో విచ్చిన కలువవు నీవు
తెలిమబ్బుపై తేలియాడే తరుణం నీవు
తొలిపొద్దుపై తేటయని కిరణం నీవు
పగడపూలలో విరజిమ్మే సువాసన నీవు
ప్రగతి బాటలో నటించే జన సమూహం నీవు
అనురాగ సరాగాల ప్రవాహం నీవు
అందని అపురూపాల ప్రశంసవు నీవు
మంచు బిందువులు మిద్దాడిన నందివర్ధనం నీవు
మలినమంటని స్వచ్చమైన చందమామ నీవు
తూరుపు ఉషోదయ తుషార బిందువు నీవు
గంధర్వలోకాన పూవనిలో అరుదెంచిన ఆమని నీవు