Total Pageviews

Tuesday, 11 July 2017

CSR Anjaneyulu - Actor

నివాళి - అలనాటి అద్భుత నటుడు సీయస్సార్ (CSR Anjaneyulu) జయంతి నేడు - నా charcoal చిత్రం.
సి.యస్.ఆర్. ఆంజనేయులు (జూలై 11, 1907 - అక్టోబరు 8, 1963) తెలుగు సినిమా నటుడు.
గొప్ప నటులకి ఉండవలసిన లక్షణాలు మూడు: ఆంగికం (అందమైన రూపం), వాచకం (మంచి కంఠస్వరం), అభినయం (హావ భావాలతో ప్రేక్షకులని ఆకర్షించుకోగల సామర్థ్యం). ఈ మూడు లక్షణాలు మూర్తీభవించిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. పూర్తి పేరు చిలకలపూడి సీతారామాంజనేయులు. స్థానం నరసింహారావుతో సమ ఉజ్జీ అన్న ప్రశంశలు అందుకున్న నటుడు - ఇటు రంగస్థలం మీదా, అటు వెండి తెర మీదా. పదకొండేళ్ళ వయస్సులోనే ఆయన రంగస్థలం మీద రాణించాడు. ఆయన జీవించిన ఐదున్నర దశాబ్దాలలో చలనచిత్ర సీమని తన అపూర్వ వైదుష్యంతో ప్రభావితం చేసేడు. పదాలను అర్థవంతంగా విరిచి, అవసరమైనంత మెల్లగా, స్పష్టంగా పలకడంలో ఆయన దిట్ట. హీరోగా, విలన్‌గా, హాస్యనటుడి్‌గా విభిన్న పాత్రలకు జీవం పోసిన వాడు సీయస్సార్
జీవితం చిత్రంలో ఆయన నోట పలికించిన ఆ కాలంలో నేను కాలేజి చదువుకునే రోజుల్లో అనే డైలాగ్‌ అప్పట్లో అందరి నోట్లో తారకమంత్రలా నానుతుండేది. మధ్యవయస్సుల నుండి వృద్ధుల వరకూ ఎవరిని కదిపినా ఆ కాలంలో నేను కాలేజీ చదువుకునే రోజుల్లో అంటుండే వారు. జగదేకవీరుని కథలో హే రాజన్‌ శృంగార వీరన్‌ అంటూ సీఎస్స్‌ఆర్‌ చెప్పిన డైలాగ్‌లు, రాజనాలతో కలిసి ఆయన పండించిన కామెడీ మరచిపోవడం సాధ్యం కాదు. విజయావారి నవ్వుల హరివిల్లు అప్పుచేసి పప్పుకూడులో సీఎస్సార్‌ అప్పు అనే పదానికి కొత్త అర్థాన్ని నిర్వచించారు. వెయ్యి రూపాయిలు కావాలంటే పది మంది దగ్గరా పది వందలు తీసుకోవడం కంటే ఒక్కరి దగ్గిరే అప్పుతీసుకో. వడ్డీ తీరిస్తే సరి. అసలు చెల్లించినప్పటి మాట కదా అంటూ ఆయన చెప్పే డైలాగ్‌లు పడీపడీ నవ్విస్తాయి.
Source : Wikipedia

Sunday, 9 July 2017

పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటులు


నివాళి - కీ.శే. పీసపాటి నరసింహమూర్తి, ప్రముఖ రంగస్థల నటులు జయంతి సందర్భంగా నా పెన్సిల్ చిత్రం.
పీసపాటి నరసింహమూర్తి (జూలై 10, 1920 - సెప్టెంబర్ 28, 2007). తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటుడు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటుడు.
పీసపాటి నరసింహమూర్తి, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10 న జన్మించాడు. ప్రారంభంలో వారు ఆకాశవాణిలో పనిచేశారు.
1938లో రంగూన్‌రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1946లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశాడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు వీరిని ఎంతగానో అభినందించారు. ఎన్.టి.రామారావు గారు వీరి నటనను (కృష్ణ పాత్రను)చూసేవారు. (source : Wikipedia)

Friday, 7 July 2017

Lata Mangeshkar



నాలుగు సంవత్సరాల క్రిందట నేను వేసిన 'లత' బొమ్మ, ఆ చిత్రానికి మిత్రులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ Vanam Venkata Varaprasadarao గారి చక్కని కవిత. fb వారు గుర్తు చేసారు.
మకరందములో మధురత మృదు మలయానిల కీలిత
మందాకిని గంభీరత మధుమాస మనోజ్ఞత
గమకములో గంగానది గమనపు శృంగారిత
గాఢముగా గుండెలలో ఊరించే ఆర్ద్రత
గాంధర్వ వేద నందనమున కుసుమించిన పూ లత
అచ్చముగా కచ్ఛపి పై ధ్వనియించు ధురీణత
కోకిల తను నాకిల తనకేనిల సరియను లత!
నా మది పలికేనది ప్రతిబింబము నువు బింబము !!! ..
Pvr Murty గారి 'లత'ను చూసినదగ్గరినుండీ పొద్దటి నుండీ మధురమైన కలత! ఏతత్ఫలితముగా మొలకెత్తిన కవితాలత!

Monday, 3 July 2017

S V Rangarao - Legendary actor



ఎస్వీ రంగారావు జయంతి నేడు. ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ నా పెన్సిల్ చిత్రం.

సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు (జులై 31918 - జులై 181974). నట యశస్విగా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటోత్కచుడిగాకీచకుడిగారావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమై పొయ్యరంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడ లేకపొయ్యారు.
బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన వరూధిని చిత్రంలో ప్రవరాఖ్యుడిగా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమయ్యాడు. తన తొలి సినిమాలో పాత్ర పోషించినందుకు గాను రూ.750 పారితోషికంగా అందుకున్నారు.
ఆ తర్వాత మనదేశంపల్లెటూరి పిల్లషావుకారుపాతాళభైరవిపెళ్ళి చేసి చూడుబంగారుపాపబాలనాగమ్మగృహలక్ష్మిబాల భారతంతాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశాడు.
నటసామ్రాట్, విశ్వనట చక్రవర్తి మొదలగు బిరుదులతో తెలుగు ప్రేక్షకులు ఆయన్ను గౌరవించారు. ఎస్వీయార్ నటించిన నర్తనశాల ఇండొనేషియాలోని జకార్తాలో ఆఫ్రో-ఆసియాఅంతర్జాతీయ చిత్రోత్సవము‍లో ప్రదర్శించబడడమే కాకుండా కీచకపాత్రకు గాను ఎస్వీయార్ అప్పటి ఎన్నో చిత్రాల కథానాయకులను వెనుకకు నెట్టి భారతదేశం నుంచి తొలి అంతర్జాతీయ ఉత్తమ నటుడుగా బహుమతి పొందాడు. కొన్ని చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన చదరంగం చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వ బహుమతి, నగదు పారితోషికం లభించాయి.
అద్భుత నటనకు ప్రతీకగా నిల్చిన ఎస్వీ రంగారావు 1974 జూలై 18వ తేదీన మద్రాసులో శాశ్వతంగా కన్నుమూశాడు.
క్లిష్టపాత్రల్లో చతురంగారావు
దుష్టపాత్రల్లో క్రూరంగారావు
హడలగొట్టే భయంకరంగారావు
హాయిగొలిపే టింగురంగారావు
రొమాన్సులో పూలరంగారావు
నిర్మాతల కొంగుబంగారావు
స్వభావానికి 'ఉంగారంగారావు
కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు
కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు
ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు
ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు
  • 2013 లో భారత సినీ పరిశ్రమ వందేళ్ళ సందర్భంగా విడుదలయిన తపాళాబిళ్ళలలో ఒకటి ఎస్వీ రంగారావు మీద విడుదలయింది.
  • (వికీపీడియా నుండి సేకరణ)