నాలుగు సంవత్సరాల క్రిందట నేను వేసిన 'లత' బొమ్మ, ఆ చిత్రానికి మిత్రులు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ Vanam Venkata Varaprasadarao గారి చక్కని కవిత. fb వారు గుర్తు చేసారు.
మకరందములో మధురత మృదు మలయానిల కీలిత
మందాకిని గంభీరత మధుమాస మనోజ్ఞత
గమకములో గంగానది గమనపు శృంగారిత
గాఢముగా గుండెలలో ఊరించే ఆర్ద్రత
గాంధర్వ వేద నందనమున కుసుమించిన పూ లత
అచ్చముగా కచ్ఛపి పై ధ్వనియించు ధురీణత
కోకిల తను నాకిల తనకేనిల సరియను లత!
నా మది పలికేనది ప్రతిబింబము నువు బింబము !!! ..
మందాకిని గంభీరత మధుమాస మనోజ్ఞత
గమకములో గంగానది గమనపు శృంగారిత
గాఢముగా గుండెలలో ఊరించే ఆర్ద్రత
గాంధర్వ వేద నందనమున కుసుమించిన పూ లత
అచ్చముగా కచ్ఛపి పై ధ్వనియించు ధురీణత
కోకిల తను నాకిల తనకేనిల సరియను లత!
నా మది పలికేనది ప్రతిబింబము నువు బింబము !!! ..
Pvr Murty గారి 'లత'ను చూసినదగ్గరినుండీ పొద్దటి నుండీ మధురమైన కలత! ఏతత్ఫలితముగా మొలకెత్తిన కవితాలత!
No comments:
Post a Comment