Total Pageviews

Monday, 3 May 2021

pencil sketch


 A sketch drawn by me from an old movie still.


I used to watch movies a lot in my hey days.  There are real good inspiration to artis, aren't they?

You can very well guess, I am inspired by the movie still of Vyjantimala.

Friday, 19 March 2021

Sobhan Babu - Tribute - Pencil sketch


Sobhan Babu (born Uppu Sobhana Chalapathi Rao) (14 January 1937 – 20 March 2008) was an Indian actor known for his works in Telugu cinema. He made his film debut in Bhakta Shabari (1959), but Daivabalam (1959), was released earlier at the box office. Sobhan babu has garnered five state Nandi Awards for Best Actor, and four Filmfare Awards for Best Telugu Actor. 

Sobhan Babu was starred in National Award winning works such as Seetharama Kalyanam (1961), Mahamantri Timmarasu (1962), Lava Kusa (1963), Nartanasala (1963), featured at the 3rd Afro-Asian Film Festival held at JakartaBangaru Panjaram (1969) for which he received special mention at the 4th International Film Festival of India, and Desamante Manushuloyi (1970).

In a film career as a matinee idol, spanning more than thirty five years, Sobhan Babu was starred in more than 200 feature films in a variety of roles in works such as Veerabhimanyu (1965), Manushulu Marali (1969), Tara Sasankam (1969), Kalyana Mandapam (1971), Chelleli Kapuram (1971), Sampoorna Ramayanam (1972), Sharada (1973), Manchi Manushulu (1974), Jeevana Jyothi (1975), Soggadu (1976), Kurukshetram (1977), Mallepoovu (1978), Gorintaku (1979), Karthika Deepam, (1979), Mosagadu (1980), Devatha (1982), and Mundadugu (1983).


(Source courtesy : Wikipedia)

నివాళి
శోభన్ బాబుగా ప్రసిద్ధుడైన ఉప్పు శోభనా చలపతిరావు (జనవరి 14, 1937 -
మార్చి 20, 2008) విస్తృతంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్న తెలుగు
సినిమా కథా నాయకుడు. అధికంగా కుటుంబ కథా భరితమైన, ఉదాత్తమైన వ్యక్తిత్వం
కలిగిన పాత్రలలో రాణించాడు. తన చలన చిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలలో
అతను ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి ఆంధ్రుల అందాల నటుడిగా తెలుగు
వారి మదిలో నిలిచిపోయారు.
(ఈ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలొ ఈ చిత్రం ముద్రితం. పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు)

 

Saturday, 24 October 2020

Manna Dey - Sketch

Remembering Manna Dey on his death anniversary today. Here is a wonderful song from the movie 'Seema', composed by the legendery music duo Shankar Jaikishan.



https://www.youtube.com/watch?v=YoqZXRH-7H4 



My pencil sketch of the legend.


Monday, 27 January 2020

ఎన్నిమార్లు చదవాలో -- తెలుగు గజల్


నా చిత్రానికి మిత్రులు మాధవరావు కొరుప్రోలు గారి గజల్

ఎన్నిమార్లు చదవాలో..మధురమైన నీ రచనలు..!
అక్షరాల మన ప్రేమకు..సాక్ష్యమైన నీ రచనలు..!
కనులు మూతపడవు ఇంత..పలుకలేని మైమరపే..
అపురూపత వర్షించే..దివ్యమైన నీ రచనలు..!
అంతరంగ మౌనమేల..ఒదిగేనో వ్రాసేందుకు..
భువనాలను త్రిప్పిచూపు..కవనమైన నీ రచనలు..!
అనురాగం ఆత్మీయత..అల్లుకున్న భావనలా..
అద్దమంటి నీ మది ప్రతి..రూపమైన నీ రచనలు..!
పలకరించు నవపరిమళ..గంధాలే చిందేనా..
నిత్యచెలిమి కావ్యమంటి..అందమైన నీ రచనలు..!
మాధవుడా నీ గజలే..లోకాలకు ఊయలలే..
పదేపదే పాడుకోగ..సరసమైన నీ రచనలు..!

Friday, 24 January 2020

బందా కనకలింగేశ్వరరావు - Banda Kanakalingeswara Rao - Pencil sketch

My pencil sketch of Banda Kanakalingeswara Rao

మన ప్రతిభామూర్తులు - బందా కనకలింగేశ్వరరావు జయంతి సందర్భంగా నా నివళి (Pencil sketch)
"గుత్తొంకాయ కూరోయ్ బావా, కోరి వండినానోయ్ బావా, కూరలోపల నా వలపంతా కూరి పెట్టినాయ్ బావా" బసవరాజు అప్పారావు గారు రచించిన ఈ గీతం, 'బందా' వారు తన గళంలో అద్భుతంగా పలికించారు. నాటి ఆకాశవాణి కార్యక్రమాలలో తరచూ వినిపించేది.
బందా కనకలింగేశ్వరరావు (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు. నాటకరంగానికి వీరు ఎనలేని సేవ చేసిన మహనీయుడు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును
గెలుపొందాడు. ఈయన 1964 లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును గెలుపొందాడు. వీరి ఉత్తమ నటనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.
వీరు కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. వీరు ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత బందరు నోబుల్ కళాశాల చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు. ఈయన నాటకాలలో అనేక పాత్రలు పోషించాడు. వాటిలో బాహుకుడు, బిల్వమంగళుడు ఈయనకు స్వయంగా ఇష్టమైనవి.
వీరు ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు.
ఈయన తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం ినిమాలైన బాల నాగమ్మ, ద్రౌపదీ మానసంరక్షణం, పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా), సారంగధర (1937 సినిమా) సినిమాలలో నటించాడు.
వీరు కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవచేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు. ఈ కళ గురించి ్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియజేశారు. 1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి మంచి నాటకాలను,
నాటికలను ప్రసారం చేశాడు.
ఈ నెల 'తెలుగుతల్లి కెనడా' పత్రికలో 'మూర్తిమంతమాయె' శీర్షికలో ఈ చిత్రం ప్రచురించబడింది. పత్రిక యాజమాన్యానికి నా ధన్యవాదాలు.

గుమ్మడి వెంకటేశ్వరరావు

గుమ్మడి వెంకటేశ్వరరావు - pencil sketch
తెలుగు సినిమా రంగములో గుమ్మడిగా ప్రసిద్ధి చెందిన గుమ్మడి
వెంకటేశ్వరరావు (జూలై 9, 1927 - జనవరి 26, 2010) తెలుగు చలనచిత్రరంగంలో
ఐదు దశాబ్దాలకు పైగా నటించాడు. గుమ్మడి పౌరాణిక చిత్రాలు, సాంఘిక
చిత్రాలు, జానపద చిత్రాలు, చారిత్రక చిత్రాలు ఇలా అన్ని రకాలైన
సినిమాల్లో తండ్రిగా, అన్నగా, తాతగా పలు పాత్రల్లో నటించాడు. అన్ని రకాల
వేషాలు ధరించినా సాత్విక వేషాలలో ప్రేక్షకులను మెప్పించాడు. అయన తన
పూర్తి పేరుతో కంటే ఇంటి పేరైన గుమ్మడి పేరుతోనే తెలుగు ప్రేక్షకుల
మనసులో నిలిచి పోయాడు. 26 January గుమ్మడి వర్ధంతి సందర్భంగా నా స్మృత్యంజలి. (మూర్తిమంతమాయె శీర్షికలో ఈ చిత్రాన్ని ప్రచురించిన 'తెలుగుతల్లి కెనడా పత్రిక' వారికి నా ధన్యవాదాలు).

Monday, 19 November 2018

D.Y. Sampath Kumar

D. Y. Sampath Kumar - My pencil sketch



(A still from Telugu hit 'Subha Sankalpam')

Dasari Yethiraja Sampath Kumar, sometimes known as D. Y. Sampath Kumar (20 November 1927 – 21 May 1999), popularly referred to as "Andhra Jalari" or Fisherman of Andhra Pradesh, was an Indian classical and folk dancer and choreographer. He assimilated the ancient traditions of dance and music of South India under the tutelage of various gurus like Sri Peri Narasimha Shastry who taught him Veena and Duvvuri Jagannadha Sarma who taught him Bharatanatyam. He became a exponent of various dance styles like BharatanatyamKuchipudiYakshagana and folk dances. He gave thousands of performances with brilliant embellishments in several states and in many countries.

He directed a few film personalities in the field of Jalari dance. Kamal Hasan was one of them.